Rajamouli: ఆ ఫొటోలు పోస్టు చేయవద్దు.. దర్శకుడు రాజమౌళి సూచన

by Thanuru Gopichand |   (  Updated:2025-05-09 12:21:17  IST  )

భయంకరమైన శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సైనికుల ధైర్యానికి వందనం అని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేర్కొన్నారు.

Rajamouli: ఆ ఫొటోలు పోస్టు చేయవద్దు.. దర్శకుడు రాజమౌళి సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో : భయంకరమైన శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సైనికుల ధైర్యానికి వందనం అని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేర్కొన్నారు. భారత సాయుధ దళాల అప్రతిహత ధైర్యం, త్యాగానికి సెల్యూట్ చేద్దాం అని పిలుపునిచ్చారు. వారి పోరాటం భవిష్యత్తులో శాంతిని నిర్మించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. దీంతో పాటు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. భారత సైన్యం ఫోటోలు, వీడియోలు తీయవద్దన్నారు. వాటిని షేర్ చేయవద్దని అలా చేస్తే శత్రువుకే సహాయం చేస్తున్నట్లవుతుంది అన్నారు నిర్ధారణ కాని వార్తలు లేదా వదంతులను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని సూచించారు. అలా చేసి అవసరంలేని గందరగోళం సృష్టించకండి.. ప్రశాంతంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. విజయం మనదే. జై హింద్.. అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.

https://x.com/ssrajamouli/status/1920746905228771330?t=lNMW2_7fFo8giulgIhxzPg&s=19

Next Story