భక్తుల ప్రాణాలతో ఆడుకోవద్దు : బొలిశెట్టి సత్యనారాయణ

by Thanuru Gopichand |

చుక్కపాలు లేకుండా నెయ్యి తయారు చేయడం ఆశ్చర్యకరం. ఇది నేరుగా భక్తులపై విషప్రయోగం చేయడం వంటిదే.

భక్తుల ప్రాణాలతో ఆడుకోవద్దు : బొలిశెట్టి సత్యనారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : భక్తుల ప్రాణాలతో ఆడొద్దని జనసేన (Janasena) నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) వైసీపీ నేతలను కోరారు. తిరుమల శ్రీవారి లడ్డూ (Tirumala Laddu) తయారీకి కల్తీ నెయ్యి (Adulterated Ghee) వినియోగించిన విషయంపై ఇటీవల సిట్ నివేదిక ఇచ్చింది. అందులో షాకింగ్ విషయాలను వెల్లడించింది. దీనిపై సత్యనారాయణ స్పందిస్తూ.. సనాతన ధర్మంతో చెలగాటం వద్దని కోరారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ (SIT) వెల్లడించిన నిజాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. చుక్క పాలు లేకుండా కేవలం రసాయనాలతో (Chemicals) నెయ్యి తయారు చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రసాయనాలతో నెయ్యి తయారు చేయడమంటే కోట్లాది మంది భక్తులకు విషం వడ్డించడమేనని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. జంతువుల కొవ్వు కంటే సింథటిక్ రసాయనాలు (Synthetic Chemicals) అత్యంత ప్రమాదకరమైనవి అన్నారు. జంతువుల కొవ్వునైనా శరీరం కొంత వరకు జీర్ణించుకోగలదని పేర్కొన్నారు. కానీ కెమికల్స్ నేరుగా కాలేయం, మూత్రపిండాలను నాశనం చేయడమే కాకుండా క్యాన్సర్ కు కూడా కారణమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భక్తుల ఆరోగ్యంపై జరిగి అతిపెద్ద కుట్రపూరితమైన దాడిగా అభివర్ణించారు.

సనాతన ధర్మంతో గానీ, వెంకటేశ్వర స్వామితో గానీ ఆడుకోవద్దని ఏడు కొండల స్వామి పాదాల చెంత నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధర్మాన్ని కాపాడటమే కాదు, భక్తుల ఆరోగ్యాన్ని రక్షించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పెత్తనం ఉన్న హిందూ దేవాలయాల విషయంలో ఇది మరింతగా వర్తిస్తుందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు ద్వారా ఇలాంటి అపచారాలకు అడ్డుకట్ట వేద్దామని పిలుపునిచ్చారు.

Next Story