- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు.. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి
గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అటువంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని హోంమంత్రి మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సామాన్య భక్తులకు స్వామివారి దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శనివారం ఆమె సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న అత్యంత వేడుకైన సింహాచలం చందనోత్సవం, వరాహ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది సుమారు 1.20 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భక్తులకు తాగునీరు, నీడ, క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గ్యాస్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు..
అనంతరం విలేకరులతో మాట్లాడిన హోంమంత్రి, రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అటువంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.






