- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్‌కు మాట్లాడే దమ్ము, ధైర్యం లేవా?: ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తుంటే, వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తుంటే, వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అన్నారు. తన పోరాటం, అజెండా ఆస్తుల కోసం కాదని స్పష్టం చేసిన ఆమె.. ఇతరుల ఆస్తిని అనుభవిస్తోంది తాను కాదని, జగన్ మోహన్ రెడ్డేనని విమర్శించారు. ఆస్తుల కోసం పోరాడే ఉద్దేశమే ఉంటే తాను ఎప్పుడో కోర్టును ఆశ్రయించేదానినని స్పష్టం చేశారు.
విజయమ్మ రాసిన లేఖ!
ఆస్తుల వివాదంపై తన తల్లి విజయమ్మ లేఖ ద్వారా పూర్తి స్పష్టత ఇచ్చినా వైసీపీ నేతలు అర్థరహితంగా విమర్శలు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లేఖపై తాను బలవంతంగా సంతకం చేయించానని ఆరోపిస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే ఆ సంతకం తనది కాదని విజయమ్మ స్వయంగా చెప్పేవారు కదా అని ప్రశ్నించారు. లేఖ వాస్తవమని జగన్‌కు తెలుసు కాబట్టే ఆయన మౌనంగా ఉంటూ, తన సోషల్ మీడియా సైన్యంతో అసత్య ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. నేరుగా మాట్లాడే దమ్ము, ధైర్యం జగన్‌కు లేవా? అని ఆమె సవాల్ విసిరారు.
దివంగత వైఎస్సార్ ఫొటో, ‘సత్యమేవ జయతే’ అనే నినాదంతో వెలువడే ‘సాక్షి’ పత్రికలో విజయమ్మ రాసిన లేఖను కనీసం చివరి పేజీలో కూడా ఎందుకు ప్రచురించలేదని షర్మిల నిలదీశారు. దీన్ని బట్టే వారికి సత్యం పట్ల ఉన్న గౌరవం ఏమిటో అర్థమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు.






