- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఎందుకు లేదో తెలుసా?
ఇటీవల ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఈ పథకం అమలు లేదు. తిరుపతి నుంచి తిరుమలకు 'స్త్రీ శక్తి పథకం'ను ప్రవేశ పెట్టకపోవడంపై మంత్రి సంధ్యారాణి కారణాలు వెల్లడించారు. తిరుమలకు ఫ్రీ బస్ పెడితే ఎక్కువమంది తిరుమల కొండకు ప్రయాణం అవుతారు. తిరుమలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. కొండపై ఘాట్ రోడ్డు మలుపుల్లో బస్సులు నడపడం అత్యంత ప్రమాదకరం అన్నారు.
ఘాట్ రోడ్డులో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులు వెళ్లాల్సి ఉందని.. ఫ్రీ బస్సు పెడితే అది సాధ్యం కాకపోవచ్చని అన్నారు. కొండపై బస్సు అదుపుతప్పే అవకాశాలకు తావు లేకుండా ఈ పథకాన్ని తిరుమల కొండకు వెళ్లే బస్సుల్లో రద్దు చేశామని పేర్కొన్నారు. అయితే కొండపైకి వెళ్ళాక అక్కడ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు.






