పవన్ కళ్యాణ్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు, కారణాలు తెలుసా?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-07 10:58:14  IST  )

ఆంధ్రపదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గత రెండు రోజుల నుంచి వైరల్ ఫీవర్(Viral Fever)తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు, కారణాలు తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రపదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గత రెండు రోజుల నుంచి వైరల్ ఫీవర్(Viral Fever)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న(గురువారం) జరిగిన ఏపీ కేబినెట్ భేటీకి(AP Cabinet Meeting) కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్‌కు వైద్యులు పలు టెస్టులు చేసిన అనంతరం వైరల్ ఫీవర్ సోకిందని.. ఆయనకు బెడ్ రెస్ట్ అవసరం అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్(Spondylitis) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. డాక్టర్ల సూచనల మేరకు రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ విశ్రాంతిలోనే ఉన్నట్లు CMO వర్గాలు తెలిపాయి. అయితే.. గతంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ ఎన్నోసార్లు వెన్నునొప్పి(back pain)తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి(disease) అని తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆ వ్యాధి.. దేనివలన వస్తుంది? దాని లక్షణాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం!

*‘స్పాండిలైటిస్’ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్‌(Arthritis)లో అరుదైన వ్యాధి(rare disease). మహిళల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తోందని వైద్యులు చెబుతున్నారు.

*ప్రస్తుత కాలంలో జీవన విధానంలో వచ్చే మార్పుల కారణంగా ఈ వ్యాధి వస్తుంది.

*మెడ నుంచి వెన్నెముక వరకు ఉండే నరాల్లో.. ఎక్కువ ఒత్తిడి(Stress) పడినా, ఎక్కువ సమయం విశ్రాంతి(Rest) లేకుండా పని చేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్నునొప్పి వస్తుంది.

*అంతేకాదు కొన్ని సార్లు మెడ(neck) లాగేస్తున్నట్లు అనిపిస్తుంది. కనీసం మెడను పక్కకు కూడా తిప్ప నివ్వదు.

ఈ క్రమంలో విపరీతమైన మెడ నొప్పి వచ్చినప్పుడు తల తిరగడం, కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుంది. వీటితో పాటు వాంతులు, వికారం, జ్వరం కూడా వస్తాయి.

*మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి.

*ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షవాతం(Paralysis) వచ్చే ప్రమాదముందని డాక్టర్లు చెబుతున్నారు.

*మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు పాకి, లోపల నరాలు కృశించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయట. దీనివల్ల రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

*ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు కానీ.. తాత్కాలికంగా టాబ్లెట్స్ తో నయం చేయవచ్చని వైద్యులు(Doctors) చెబుతున్నారు.

నోట్: ఈ సమాచారం ఇంటెర్నేట్ ఆధారంగా తీసుకోబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించలేదు. ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.


Also Read...

AP News:పవన్ కళ్యాణ్, లోకేష్ ర్యాంకులపై మాజీ మంత్రి సెటైర్.. స్పందించిన టీడీపీ నేత







Next Story