కర్నూలు బస్సు దగ్ధం.. మృతదేహాలకు స్పాట్‌లోనే డీఏన్ఏ, పోస్టుమారం టెస్టులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-24 08:51:10  IST  )

కర్నూలు బస్సు దగ్ధంలో మృతి చెందిన వారికి స్పాట్‌లోనే డీఏన్ఏ, పోస్టుమారం టెస్టులు నిర్వహిస్తున్నారు....

కర్నూలు బస్సు దగ్ధం.. మృతదేహాలకు స్పాట్‌లోనే డీఏన్ఏ, పోస్టుమారం టెస్టులు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) చిన్నటేకూరు(Chinnatekuru)లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)లో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగి దాదాపు 20 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే వీరి మృతదేహాలను వెలికితీశారు. స్పాట్‌లోనే వైద్యులు డీఎన్ఏ టెస్టులతో పాటు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం డీఏన్‌ఏ రిపోర్టు ఆధారంగా మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు.


ప్రస్తుతం ఆస్పత్రిలో 12 మందికి వైద్యం అందించామని తెలిపారు. 8 మంది స్వల్పగాయాలైనట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం 8 మందిని డిశ్చార్జి చేశామని చెప్పారు. ప్రస్తుతం నలుగురికి వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒకరికి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, మిగిలిన ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Next Story