- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు వెళ్లేవారికి అలర్ట్.. దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లు తాత్కాలిక మార్పు
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం శ్రీవారిమెట్టు మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముఖ్యమైన సమాచారం విడుదల చేసింది. శ్రీవారిమెట్టు (Srivari Mettu)వద్ద ఇప్పటివరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరి (Alipiri)లోని భూదేవి కాంప్లెక్స్ (Bhudevi Complex)కు తరలించనున్నట్లు టీటీడీ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం శ్రీవారిమెట్టు మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముఖ్యమైన సమాచారం విడుదల చేసింది. శ్రీవారిమెట్టు (Srivari Mettu)వద్ద ఇప్పటివరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరి (Alipiri)లోని భూదేవి కాంప్లెక్స్ (Bhudevi Complex)కు తరలించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ కొత్త కౌంటర్లు జూన్ 6, 2025 సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయి.
శ్రీవారిమెట్టు మార్గంలో కొండ ఎక్కే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూన్ 6, శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. ఈ టోకెన్లు ‘ముందుగా వచ్చినవారికి ముందు’ (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్) ప్రాతిపదికన కేటాయించబడతాయి. శనివారం శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రం నుంచే టోకెన్లు అందజేయనున్నారు. భక్తులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు చూపించి ఈ టోకెన్లను పొందాలి.
దివ్యదర్శనం టోకెన్ పొందిన భక్తులు శ్రీవారిమెట్టులో 1,200వ మెట్టు వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రంలో తమ టోకెన్‌ను స్కాన్ చేయించుకోవాలి. స్కానింగ్ తర్వాతే వారు శ్రీవారి దర్శనానికి అనుమతించబడతారు. అదనంగా సర్వదర్శనం (SSD) టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారానే అందుబాటులో ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది.






