- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి "దిత్వా" తుఫాన్ ఎఫెక్ట్...4 రోజుల పాటు భారీ వర్షాలు
శ్రీలంక తీరంలో 'దిత్వా' తుఫాన్ కొనసాగుతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది వాతావరణ శాఖ. ఈ కొత్త 'దిత్వా' తుఫాన్ ఎ

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొట్టనున్నాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుఫాన్ ( ditwah cyclone ) కొనసాగుతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది వాతావరణ శాఖ. ఈ కొత్త 'దిత్వా' తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది.
అంతేకాదు ఈ తుఫాన్ కారణంగా ఏపీవ్యాప్తంగా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 'దిత్వా' తుఫాన్ ఎఫెక్ట్ వల్ల నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఈ తుఫాన్ కారణంగా శనివారం భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. కడప, ప్రకాశం, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్య సాయి, జిల్లాలలో శనివారం మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.
ఇక 'దిత్వా' తుఫాన్ ( ditwah cyclone ) ఎఫెక్ట్ తో ఆదివారం రోజున వైయస్సార్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక సోమవారం రోజున గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. నంద్యాల, కర్నూల్, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి తీవ్రత కూడా కొనసాగునున్నట్లు పేర్కొంది. వర్ష ప్రభావం లేని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది.
- Tags
- ditwah cyclone
- ap






