ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు

by Thanuru Gopichand |   (  Updated:2025-08-13 10:41:27  IST  )

ఈ ఏడాది డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్​వెల్లడించారు.

ఏడాది చివరిలోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఈ ఏడాది డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్​వెల్లడించారు. ఈ రోజు సచివాలయంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం తొలి భేటీ జరిగింది. సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని భేటిలో నిర్ణయించారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. ఈ లోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్ కు పంపించవచ్చని మంత్రులు తెలిపారు. సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారని తెలిపారు.

గత ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్వీభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తామని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు కోసం కసరత్తు చేస్తామని తెలిపారు. రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల బృందం పని చేస్తుందన్నారు. నియోజకవర్గాల జోలికి వెళ్లబోమన్న మంత్రి అనగాని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని.. అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అని మంత్రి పేర్కొన్నారు.

Next Story