- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:మంత్రి లోకేష్ ఆదేశాలతో దివ్యాంగులకు ట్రై సైకిళ్ళ పంపిణీ
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి(State Development) పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి(State Development) పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాదర్బార్‌లో దివ్యాంగులు కీలక విజ్ఞప్తి చేశారు. దైనందిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ట్రై సైకిళ్లు అందించి ఆదుకోవాలని దివ్యాంగులు చేసిన విజ్ఞప్తికి మంత్రి నారా లోకేష్ మానవత్వంతో స్పందించారు. విశాఖలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో భీమునిపట్నం పెద్ద నాగమయ్యపాలెంకు చెందిన రీసు చిన్న, రీసు సంధ్య, రీసు సాయి మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. తమకు పూర్తిస్థాయి అంగవైకల్యం పింఛనుతో పాటు ట్రై సైకిళ్లు అందించాలని విన్నవించారు. తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ ట్రై సైకిళ్ల పంపిణీకి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విశాఖ టీడీపీ నేతల(TDP Leaders) సమక్షంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించారు. తమ విజ్ఞప్తికి స్పందించి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






