- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ఏపీ రైతులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్ : కొత్త ఏడాదిలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను (Pattadar Pass Book) పంపిణి చేయనున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) ప్రకటించారు. రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కొత్త పాస్ పుస్తకాలను అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటికే గ్రామాల్లో రీసర్వే పూర్తైందని పేర్కొన్నారు. మొత్తం 21.80 లక్షల పాస్ పుస్తకాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నాని తెలియజేశారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జనవరి 2 నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 9 వరకు గ్రామ సభల్లో పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. వెబ్ ల్యాండ్ లోని వివరాల ప్రకారమే ఎటువంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే అధికారులు పాస్ బుక్ ఇచ్చేటప్పుడు రైతుల వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో 8వేల గ్రామాల్లోని భూముల రీసర్వే ప్రక్రియ చేపట్టారన్నారు. అనంతరం క్యూఆర్ కోడ్ తోపాటు పాస్ పుస్తకాలపై వైయస్ జగన్ బొమ్మతో భూహక్కు పత్రాలనిచ్చారని గుర్తు చేశారు. ఆ విషయం రైతులను ఎంతో ఆందోళనకు గురి చేసిందన్నారు. ఇప్పుడు రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో మాత్రమే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని ప్రకటించారు.






