- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొంథా తుఫాన్ కదలికపై విపత్తుల నిర్వహణ సంస్థ అప్ డేట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, మొదట వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది.

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, మొదట వాయుగుండంగా మారి తీవ్ర తుఫాను (severe storm)గా రూపాంతరం చెందింది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎక్కువగా ఉండనుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులకు అలర్ట్ జారీ చేసింది. దీంతో మరికొద్ది గంటల్లో రానున్న తీవ్ర తుఫానును ఎదుర్కునేందుకు అధికారులు పూర్తిగా సిద్ధం అయ్యాయి. ఇదిలా ఉంటే మొంథా తుఫాన్ (Storm) కదలికపై ఎప్పటికప్పడు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Organization) అప్ డేట్ ఇస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 9:30 గంటలకు కొత్త అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ ఉంది.
గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో మొంథా తుపాన్ ముందుకు కదిలినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ తుఫాను చెన్నైకి 560 కి.మీ, కాకినాడకి 620 కి.మీ., విశాఖపట్నంకి 650 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం పెరుగుతుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ మొంథా తుఫాన్ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90-110 కి మీ వేగంతో బలమైన ఈదురుగాలులు విస్తాయని అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.






