Kotappakonda: కోటప్పకొండ ప్రభల జాతరలో అపశృతి

by Naga Rani Yarlagadda |

కోటప్పకొండ ప్రభల జాతరలో అపశృతి చోటుచేసుకుంది. తిరుగుపయనంలో

Kotappakonda: కోటప్పకొండ ప్రభల జాతరలో అపశృతి
X

దిశ, వెబ్‌డెస్క్: శివరాత్రి అంటేనే కోటప్పకొండ.. కోటప్పకొండ అంటే శివరాత్రి అనేలా జరుగుతుంది అక్కడ ప్రభల ఉత్సవం. కొండపై త్రికోటేశ్వరుడు.. కింద ప్రభలు.. రాత్రివేళల్లో ఆ ప్రభలు విద్యుత్ కాంతులీనుతూ ఉండగా జరిగే తిరనాళ్లు.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ ప్రభల జాతర పూర్తయింది. తిరిగి వెళ్లే క్రమంలో నిధి వద్ద అపశృతి చోటుచేసుకుంది. చిలకలూరిపేట మండలం మద్దిరాల విద్యుత్ ప్రభను తీసుకెళ్తుండగా.. ప్రభ బండి చక్రం గుంతలో పడిపోయింది. దీంతో ప్రభ ఒరిగి చక్రాలతో సహా లేచి పక్కకు పడిపోయింది. ఆ సమయంలో ప్రభ పక్కన ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

ఆదివారం రాత్రి జాతర పూర్తవ్వగా.. సోమవారం ఉదయం 9-11 గంటల్లోగా ప్రభలను విద్యుత్ గ్రిడ్ దాటించాల్సి ఉంటుంది. నిర్వాహకులు రాత్రివేళలో అలసిపోవడంతో.. తిరుగుపయనంలో తాళ్లను సరిగ్గా పట్టులేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభను ఇనుపకడ్డీలతో చేయడంతో దానిని పైకి లేపి తీసుకెళ్లాలన్నా కష్టంగా ఉండటంతో.. ప్రభను బండి నుంచి విడదీసి గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story