- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anagani: నీచ రాజకీయాలు.. వైసీపీ డీఎన్ఏ!
వైసీపీ నేతల డీఎన్‌ఏలోనే హత్య రాజకీయాలు ఉన్నాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనిగాని సత్యప్రసాద్హాట్కాంమెంట్స్చేశారు.

వారు శాంతి భద్రతల గురించి మాట్లాడడం హాస్యాస్పదం
మీ రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయింది..
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ నేతల డీఎన్‌ఏలోనే హత్య రాజకీయాలు ఉన్నాయని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనిగాని సత్యప్రసాద్హాట్కాంమెంట్స్చేశారు. బాబాయ్ ని హత్య చేసి అధికారంలోకి వచ్చిన మీకు హత్య రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ రోజు ఆయన ఒక ట్వీట్లో వైసీపీ ఫైర్అయ్యారు. వైసీపీ నేతలు శాంతిభద్రతల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ హయాంలో సొంత తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులకు రక్షణ లేక రాష్ట్రం వదిలి పోయారని ఆయన ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 48 గంటలు దాచిన చరిత్ర వైసీపీది అన్నారు. సత్య హరిశంద్రుడి కన్నా వైసీపీ నేతలే నిజాయితీపరులు అన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని వంటి కొందరు వైసీపీ నాయకుల రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందన్నారు. షెడ్‌లో పనికిరాని వాహనాల్లా మారారని ఎద్దేవా చేశారు. అందుకే, టీవీలు, పత్రికల్లో కనిపించేందుకు అసత్యాల స్క్రిప్ట్‌లతో నీచమైన రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేని కోడిగుడ్డు వైసీపీ నేత కూడా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. వీరి రోజువారీ కార్యక్రమం ఒకటే తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను అనుసరించి అసత్య ప్రచారాలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం, మేము బతికే ఉన్నామని చెప్పుకోవటమే అన్నారు. నీచ రాజకీయాలు వైసీపీ డీఎన్‌ఏలోనే ఉన్నాయి అన్నారు. బాబాయ్‌ను గొడ్డలితో నరికిన ఘటన నుంచి గులక రాయి డ్రామాల వరకు, వైసీపీ రాజకీయ నాటకాలు చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని తెలిపారు. టిడిపి ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించి పేదల కళ్ళలో ఆనందం చూస్తే, వైసీపీ నేతలు మాత్రం రుషికొండ ప్యాలస్ కట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూశారు. ఇది పెత్తందారి పోకడ్లకు నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వైసీపీ మార్క్ అరాచకాలు, అక్రమాలు, హత్య రాజకీయాలకు చరమగీతం పాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
https://x.com/SatyaAnagani/status/1962046725616709687?t=HbbtJ-cTOExsHpZnLOc7fw&s=19






