- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ఈ బోర్డులోకి వచ్చా: మెహర్ రమేశ్
by Vemula.Srinu Prasad |
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే APSFTVTDC బోర్డులోకి వచ్చానని దర్శకుడు మెహర్ రమేశ్ అన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు..

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే APSFTVTDC బోర్డులోకి వచ్చానని దర్శకుడు మెహర్ రమేశ్ అన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెహర్ రమేశ్ మాట్లాడుతూ సినిమాపై పవన్ కల్యాణ్‌కు ఉన్న ప్రేమ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏపీ నుంచి తమిళనాడు వెళ్లిందని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. ఫిలిం ఫ్రెండ్లీ ఏపీని తయారు చేసేందుకు APSFTVTDC బోర్డును ఏర్పాటు చేశారని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిని ఎంత త్వరగా అభివృద్ధి చేస్తున్నారో..అంతే త్వరగా ఫిలిం ఇండస్ట్రీని కూడా డెవలప్ మెంట్ చేయాలని రమేశ్ ఆకాంక్షించారు. ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కూడా కృషి చేస్తామని మెహర్ రమేశ్ పేర్కొన్నారు.
Next Story






