ఏవోబీలో మావోయిస్టుల కదలికలు.. డీఐజీ గోపీనాథ్ జెట్టి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అల్లూరి జిల్లా ఏవోబీలో మావోయిస్టుల కదలికలపై డీఐజీ గోపీనాథ్ జెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు..

ఏవోబీలో మావోయిస్టుల కదలికలు.. డీఐజీ గోపీనాథ్ జెట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మావోయిస్టులు(Maoists) లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌(Operation Kagar)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పలువురు మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి. దీంతో బడా బడా దళ సభ్యులు కూడా మృతి చెందారు. ఆగ, మగ అనే తేడా లేకుండా తుపాకులను ఎక్కుపెట్టారు. దీంతో మావోయిస్టులకు భారీగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఏపీకి చెందిన కీలక మావోయిస్టు నేతలు సైతం మృతి చెందారు.

మరోవైపు కేంద్రం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో మావోయిస్టుల విషయంలో అటు ఏపీ పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District)లోని ఏవోబీలోనూ మావోయిస్టులపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. అయితే మావోయిస్టుల కదలికలు తగ్గినట్లు రాష్ట్ర పోలీస్ శాఖ(Police Department) గుర్తించింది. ఈ మేరకు డీఐజీ గోపీనాథ్ జెట్టి(DIG Gopinath Jetty) మీడియాతో మాట్లాడారు. అల్లూరి జిల్లా ఏవోబీలో మావోయిస్టుల కదలికలు తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నామన్నారు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. గంజాయి పంట ప్రత్యామ్నాయంపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, కొనుగోలు, విక్రయాలు చేసినా కఠిన శిక్షలు తప్పవని డీఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు.

Next Story