ఏపీ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఆ బ‌స్సుల స్వ‌రూప‌మే మార‌నుంది !

by velandi.Saikiran |

ఏపీలో ఉన్న పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ఎల‌క్ట్రిక్‌ ఏసీ బస్సులుగా

ఏపీ ఆర్టీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఆ బ‌స్సుల స్వ‌రూప‌మే మార‌నుంది !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ప్రత్యేకంగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ఎల‌క్ట్రిక్‌ ఏసీ బస్సులుగా మార్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది ఆర్టీసీ సంస్థ. మొట్ట మొదటగా చిత్తూరు జిల్లాలో ఈ ప్రక్రియను ప్రారంభించింది. పూణే, బెంగళూరు సంస్థల సహకారంతో ఆర్టీసీ బస్సులను మార్చబోతున్నారు.

ఈ మార్పులతో నిర్వహణ ఖర్చులు సగానికి తగ్గి... పర్యావరణానికి మేలు జరుగుతుందని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, మరికొన్ని ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటగా ఒక్క బస్సుతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించబోతున్నారట. పల్లె వెలుగు పేరుతో నడుస్తున్న ఓ అశోక్ లేలాండ్ సూపర్ లగ్జరీ బస్సును ఈ ప్రయోగం కోసం ఎంపిక చేశారు. ఈ ప్రయోగం కోసం మొత్తం 180 రోజులు పడుతుందట. ఆ తర్వాత ఆ బస్సు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుగా మారనుంది.

Next Story