- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదటి ఉచిత సిలెండర్ తీసుకోలేదా.. డోన్ట్వర్రీ
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్సిలిండర్ మొదటి విడత ఇంకా తీసుకోలేదా..?

దిశ, డైనమిక్బ్యూరో: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్సిలిండర్ మొదటి విడత ఇంకా తీసుకోలేదా..?డోన్ట్వర్రీఅయితే ఇంకా గడువు ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీపం-2 పథకం కింద లబ్ధిదారులు మార్చి 31 లోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్ ను బుక్ చేసుకుని పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. మొత్తం 1. 55 కోట్ల లబ్ధిదారులలో ఇప్పటి వరకు 91,36,235 మంది సిలిండర్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు. 86,60,522 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.687.38 కోట్ల సబ్సిడీ మొత్తం జమయినట్లు వివరించారు. ప్రభుత్వం రూ 691.54 కోట్లను సబ్సిడీ కోసం విడుదల చేసిందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందుతాయి. అంటే ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నమాట. ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పథకం ప్రారంభించిన దాదాపు 16 లక్షల మంది బుక్ చేసుకున్నారు. అయితే ఈ గడువు ఇంకా మార్చి చివరి వరకు ఉంది. దీంతో ఇంకా బుక్చేసుకోని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.






