- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ ప్రసంగం కనీసం ఆయనకైనా అర్థమైందా..? మాజీమంత్రి అంబటి ఎద్దేవా
పవన్ కళ్యాణ్ ప్రసంగం కనీసం ఆయనకైనా అర్థమైందా? అని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (YSRCP Leader Ambati Rambabu) ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ ప్రసంగం కనీసం ఆయనకైనా అర్థమైందా? అని మాజీమంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (YSRCP Leader Ambati Rambabu) ఎద్దేవా చేశారు. శుక్రవారం జనసేన పార్టీ (Janasena Party) 12 వ ఆవిర్భావ దినోత్సవ సభ (Inaguration Day) జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అంబటి.. పలు విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో (Pawan Speech) ఏం చెప్పాలనుకున్నాడు.. ఏం చెప్పాడు.. అనేది తనకు అర్థం కాలేదని, కనీసం ఆయనకైనా అర్థం అయ్యిందా అని అన్నారు. స్టేజీ ఎక్కిన తర్వాత మొదటి 15 నిమిషాలు శ్లోకాలు చదువుతూ ఊగిపోయి మాట్లాడారని తెలిపారు.
కానీ ఆయన ప్రసంగంలో ఒక వాస్తవం మాట్లాడారని, నాలుగు దశాబ్దాల టీడీపీ (TDP) పడిపోతుంటే నిలబెట్టింది జనసేన పార్టీ అని చెప్పారని, నిజంగానే టీడీపీని నిలబెట్టేందుకే జనసేన పుట్టిందనేది వాస్తవమిని చెప్పారు. కేవలం కాపులను ఆకర్షించేందుకే టీడీపీ బీ టీమ్ (TDP B-Team) గా జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని తెలిపారు. ఇక ఏమైనా మాట్లాడితే 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ (100% Strike Rate) అంటున్నారని, నిలబడిన 21 సీట్లు మీరు గెలిచారని, దీనికే 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ అంటే ఎలా అని ప్రశ్నించారు. అది బలం కాదని, రెండు పార్టీల మద్దతు మీకు వాపుగా కనిపించి 21 సీట్లు గెలిచారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. జనసేన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు నీ వాళ్లు కాదని, టీడీపీలో టికెట్ రాక, మేము రిజెక్ట్ చేసిన వాళ్లు నీ పార్టీలోకి వచ్చి గాలి వీయడంతో గెలిచేశారని అన్నారు. ఇక జనసేన, టీడీపీ పార్టీలు వేరు కాదని, రెండు పార్టీలకు బాస్ చంద్రబాబే అని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.






