- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనకేమైనా కళ్లు దొబ్బాయా? ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సీరియస్ కామెంట్స్
వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు.. మాజీ మంత్రి పేర్ని నానిపై (Perni Nani) ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (AdiReddy Vasu) సీరియస్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు.. మాజీ మంత్రి పేర్ని నానిపై (Perni Nani) ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (AdiReddy Vasu) సీరియస్ కామెంట్స్ చేశారు. పేర్నికి నానికి కళ్లు దొబ్బాయా? ఆయన అన్నం తింటున్నారా? లేక గడ్డి తింటున్నారా? అంటూ మండిపడ్డారు. పీపీపీ విధానంపై పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు జరుగుతుంటే వైసీపీ నేతలు పనిగట్టుకని మరీ తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారన్నారు. ప్రజలెవరూ వైసీపీ నేతల మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సహా అందరూ దొంగల ముఠాలా తయారయ్యారని అన్నారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. అది ఓర్వలేక పెట్టుబడిదారుల్ని రానివ్వకుండా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పుట్టిన రోజున చిన్న పిల్లలతో కత్తులు పట్టించారని.. రప్పా రప్పా పోస్టర్లు, మేకపోతుల బలులతో రాష్ట్రంలో కలకలం రేపారన్నారు. వైసీపీ నేతల్లో ఇంతటి పైశాచికం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.
అయితే పేర్ని నాని అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్ప సేవ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు, చివరకు కూటమిలో భాగస్వాములైన జనసేన వాళ్ళు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ కు సమర్పించిన కోటి సంతకాల్లో స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టారన్నారు. అయినా కూటమి ప్రభుత్వ పెద్దలు తమ తప్పు తెలుసుకోవడం లేదన్నారు. సీఎం చంద్రబాబు చెప్పే పీపీపీలో ఇంకో పీ సైలెంట్ గా కలిసి ఉందని ఎద్దేవా చేశారు. ఆ నాలుగు 'పీ'ల అర్థం పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాఫిట్ అని కొత్త అర్థం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఖండించారు.






