- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:వారికి సెలవులు రద్దు చేసిన చంద్రబాబు సర్కార్?
ఏపీలో రెండుమూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రెండుమూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. గ్రామాల్లో నీరు నిలిచిపోవడం వల్ల చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదతో రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వెంటనే సరిచేసేలా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులకు సెలవులు తీసుకోకుండా సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారనుండటంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.






