- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Polavaram Project: డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు ఇవాళ(శనివారం) ప్రారంభమైంది.

దిశ,వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు ఇవాళ(శనివారం) ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమి పూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఏపీ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్(new diaphragm wall) నిర్మాణం పనులకు కేంద్ర జల సంఘం(CWC) అనుమతి మంజూరు చేసింది. ఇటీవల ప్రాజెక్ట్ పునః నిర్మాణానికి నడుంబిగించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఆ తర్వాత వెంటనే దీనిపైనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(Earth Come Rock Fill Dam) పనులు కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం.
గతంలో ఏర్పాటు చేసిన పాత డయాఫ్రం వాల్(Old diaphragm wall)కు 6 మీటర్ల ఎగువన 1.396 కిలోమీటర్ల పొడవు, 1.5మీటర్ల మందంతో ఈ పనులను చేపట్టనున్నారు. దీని కోసం ప్లాస్టిక్ కాంక్రీట్ - టీ 5 మిశ్రమాన్ని ఉపయోగించనున్నారు. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించనున్నారు. ఈ పనులను విదేశీ కంపెనీ అయిన బావర్ చేపడుతుండగా.. దీని కోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్లు వంటి భారీ యంత్రాలను వినియోగించనున్నారు. వీటన్నింటినీ జర్మనీ నుంచి తెప్పించినట్టు సమాచారం. డయాఫ్రం వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలుపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.






