రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్.. వదులుకుంటారా?

by Gantepaka Srikanth |

ఫ్రీగా ఏది దొరికినా ఎగబడే జనాలకు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు.

రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్.. వదులుకుంటారా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రీగా ఏది దొరికినా ఎగబడే జనాలకు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా గాజులపల్లె గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామంలోని వాగులో వజ్రాలు(Diamonds) దొరుకుతున్నాయని ప్రజలు ఎగబడ్డారు. గ్రామస్తులే కాకుండా దూరప్రాంతాలనుంచి ప్రజలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకొని వాగులో వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వజ్రం దొరికితే అదృష్టం.. దొరక్కపోతే దురదృష్టం.. ఇలా అనుకొని అందరూ ఓ ప్రయత్నం అయితే చేస్తున్నారు. వర్షాలకు అడవుల్లో నుంచి వజ్రాలు కొట్టుకొచ్చి వాగులో, వాగు ఒడ్డున ఇసుక రాళ్ళలో దాగి ఉంటాయని నమ్మకంతో ఇలా గాలిస్తున్నారు. వీడియో

Next Story