రూ.కోటి విలువైన రంగురాళ్లు పట్టివేత

by Naga Rani Yarlagadda |

పల్నాడు జిల్లా దాచేపల్లిలో అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ రంగురాళ్లు పట్టుబడ్డాయి.

రూ.కోటి విలువైన రంగురాళ్లు పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా దాచేపల్లిలో అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ రంగురాళ్లు పట్టుబడ్డాయి. దాచేపల్లిలోని ఒక గిడ్డంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన రంగురాళ్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. ఒక కోటి వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ రంగురాళ్లను శంకరాపురం కొండల నుంచి అక్రమంగా వెలికితీసి ఇక్కడ నిల్వ ఉంచినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అనుమతులు లేకుండా సహజ వనరులను వెలికితీయడంపై అటవీశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమ నిల్వలకు బాధ్యులైన వారిపై అధికారులు కేసు నమోదు చేశారు. రంగురాళ్ల అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విజిలెన్స్, అటవీశాఖ అధికారులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు.

కర్నూల్ లో బంగారం, వెండి చోరీ

మరోవైపు కర్నూల్ జిల్లాలో భారీగా బంగారం, వెండి చోరీకి గురైంది. వివేక్ నగర్లోని నాగేంద్ర ఇంట్లో పనిచేసే పర్వీన్ ఈ చోరీకి పాల్పడింది. 15 తులాల బంగారం, 30 తులాల వెండి కాజేసింది. ఇంట్లో దొంగతనం జరిగిందని నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో ఇంటి పనిమనిషే అసలు దొంగ అని తేలింది. పర్వీన్ ను పోలీసులు అరెస్ట్ చేసి.. ఆమె వద్ద నుంచి చోరీ చేసిన నగలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story