దువ్వాడ ఆరోపణలపై స్పందించిన ధర్మాన కృష్ణదాస్

by Thanuru Gopichand |

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) తమపై చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) తప్పుబట్టారు.

దువ్వాడ ఆరోపణలపై స్పందించిన ధర్మాన కృష్ణదాస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) తమపై చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) తప్పుబట్టారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం స్పందించారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తన గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం వల్లనే తమవాళ్లు స్పందిస్తు్న్నారని పేర్కొన్నారు. కింజారపు అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు. తనకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో ఎటువంటి విబేధాలు లేవన్నారు.

అయితే.. శుక్రవారం అర్థరాత్రి నిమ్మాడ వద్ద నాటకీయ పరిణమం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన వాహనాన్ని హైవేపై నిలిపి హల్ చల్ చేశారు. తనపై దాడి చేసి హత్య చేయాలనే కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. దమ్ముంటే రావాలని.. తాను అక్కడే ఉంటానని సవాల్ విసిరారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. కావాలంటే పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన ప్రసాద రావు, కృష్ణదాస్ ల అవినీతిపై ఇటీవల ఆయన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే అతని హత్యకు కుట్ర జరిగిందనే అనుమానాలను దువ్వాడ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాధురి, కింజరాపు అప్పన్నల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఆడియోలోని మాటలు వాస్తవమేనని కృష్ణదాస్ చెప్పడంతో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.

Next Story