- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : లిక్కర్ స్కాంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కాం(AP Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ లిక్కర్ స్కాం(AP Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించారని అనుమానిస్తున్న ధనుంజయ రెడ్డి(Dhanunjaya Reddy), కృష్ణమోహన్ రెడ్డి(Krishnamohan Reddy)లను నేడు సిట్(SIT) అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం వీరి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. రేపు వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు సమాచారం. వైఎస్ఆర్‌సీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కార్యాలయ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేటి సాయంత్రం వరకు వారిని అరెస్ట్ చేయకూడదు అనే ఆదేశాలు ఉండటంతో.. ఈ మూడు రోజులు వారిని సిట్ ఆఫీసులో విచారించారు. సుప్రీం విధించిన గడువు ముగియడంతో కొద్దిసేపటి క్రితం వారిని అరెస్ట్ చేశారు అధికారులు.






