డీజీపీగా సర్వీస్ ముగింపు.. సంతృప్తి వ్యక్తం చేసిన తిరుమల రావు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-30 09:31:35  IST  )

డీజీపీగా ద్వారకాతిరుమలరావు (DGP Tirumala Rao)సర్వీస్ శుక్రవారంతో ముగియనుంది....

డీజీపీగా సర్వీస్ ముగింపు.. సంతృప్తి వ్యక్తం చేసిన తిరుమల రావు
X

దిశ, వెబ్ డెస్క్: డీజీపీగా ద్వారకాతిరుమలరావు (DGP Tirumala Rao)సర్వీస్ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్(Cybercrime) మినహా నేరాలన్నీ నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటి వరకూ 28,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫింగర్ ప్రింట్ ఆధారారంగా నేరాలు గుర్తించడంలో రాష్ట్రం ముందున్నట్లు తెలిపారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో స్పెషల్ ఫోకస్ పెట్టామని, నేరం చేసేందుకు నేరగాళ్లు భయపడేలా నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. దేశంలోనే తొలిసారి డిజిటల్ బారికేడింగ్ సిస్టమ్‌ను పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలను తగ్గించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని డీజీపీ తిరుమలరావలు తెలిపారు.

కాగా శుక్రవారంతో డీజీపీగా ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయనను కూటమి ప్రభుత్వం రిలీవ్ చేసింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కమిషనర్, ఆర్టీసీ వీసీ, ఎండీ పదవుల నుంచి రిలీవ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగాను, నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగంగా అదనపు ఎస్పీగా కొనసాగారు. అనంతపురం, కడప, మెదక్ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ రేంజ్‌తో పాటు ఎస్ఐబీలో డీఐజీగా, చెన్నై సీబీఐలో కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఏపీ ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ద్వారకా తిరుమల రావు పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2021లో ఆర్టీసీ ఎండీగా నియామకమయ్యారు. 2024 జూన్ 21న ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.

Next Story