- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:టీటీడీ ట్రస్టులకు భారీ విరాళాలు అందించిన భక్తులు.. ఎంతంటే?
కలియుగ దైవం తిరుమల(Tiruamala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల(Tiruamala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల చేరుకొని భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో పలువురు భక్తులు టీటీడీ ట్రస్టులకు విరాళాలు కూడా అందజేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీకి రూ.2.45 కోట్లు విరాళం(Donation) అందింది. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు ఇవాళ(గురువారం) రూ.2.45 కోట్లు విరాళాలు అందినట్లు టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.
చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. శ్రీలంకకు చెందిన ఓ దాత అన్న ప్రసాదం ట్రస్టుకు మరో రూ.కోటి విరాళం అందించారు. నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించడం జరిగింది. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu), అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి(Venkaiah Chowdary)కి విరాళం డీడీలు అందజేశారు.






