- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం
by Naga Rani Yarlagadda |
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. కేవలం 11 కంపార్టుమెంట్లలో భక్తులు ఉండగా.. తక్కువసమయంలోనే స్వామివారి దర్శనం జరగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వారం భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఉదయం 8 గంటల సమయం వరకూ .. శ్రీవారి ఉచిత దర్శనార్ధం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-4 గంటల్లో దర్శనం జరుగుతుందని తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనం టికెట్లు పొందిన భక్తులకు 2-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా.. నిన్న (శుక్రవారం) స్వామివారిని 69,049 మంది భక్తులు దర్శించుకోగా.. 23,842 మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
Next Story






