సంక్రాంతి ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |

నాలుగైదు రోజులుగా సంక్రాంతికి ప్రజలంతా సొంతూళ్లకు క్యూ కట్టడంతో తిరుమలకు భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.

సంక్రాంతి ఎఫెక్ట్.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగైదు రోజులుగా సంక్రాంతికి ప్రజలంతా సొంతూళ్లకు క్యూ కట్టడంతో తిరుమలకు భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.భోగి, సంక్రాంతి పండుగలు ఘనంగా జరుపుకున్నాక.. మళ్లీ తిరుమలకు పయనమవుతున్నారు. దీంతో అలిపిరి వద్ద పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. చలితీవ్రత ఎక్కువగా ఉన్నా.. భక్తులు తరలివస్తున్నారు. రేపు (శుక్రవారం) సర్వదర్శనానికి 10 వేల ఉచిత టోకెన్లను టీటీడీ జారీ చేసింది. సంక్రాంతిని పురస్కరించుకుని కపిలతీర్థం వద్ద పెద్దలకు, పూర్వీకులకు తర్పణాలు వదిలేందుకు నగరవాసులు బారులు తీరారు. నిన్న (బుధవారం) శ్రీవారిని 76,289 మంది భక్తులు దర్శంచుకోగా.. 27,586 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు సమకూరిందని టీటీడీ తెలిపింది.

Next Story