తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూలైన్లు.. దర్శనానికి ఎంత సమయం అంటే..

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకూ క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూలైన్లు.. దర్శనానికి ఎంత సమయం అంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకూ క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. సోమవారం 74,149 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.72 కోట్లు వచ్చినట్లు తెలిపింది.

గత గురువారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోతున్నాయి. టోకెన్లు లేనివారికి సర్వదర్శనం ఆలస్యమవుతుండగా.. టైంస్లాట్ టోకెన్లు, టికెట్లు ఉన్నవారికి దర్శనానికి 4-5 గంటలు పడుతోంది.

అలాగే నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఈఓ, ఏఈఓ పాల్గొన్నారు. తిరుమంజనంలో భాగంగా ఆలయ అంతర్భాగాన్ని శుద్ధి చేశారు.

Next Story