తిరుమల క్యూ లైన్లలోకి వెళ్తున్నారా.. భక్తులకు ఈ విషయం తెలుసా..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-14 04:40:57  IST  )

తిరుమల శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు...

తిరుమల క్యూ లైన్లలోకి వెళ్తున్నారా.. భక్తులకు  ఈ విషయం తెలుసా..!
X

దిశ, వెబ్ డెస్క్:తిరుమల శ్రీవారి(Tirumala Srivaru )ని దర్శించేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా తిరుమలకు వస్తున్నారు. తిరుమల నిబంధనల ప్రకారం స్వామివారిని దర్శించుకుని తిరిగి పయనం అవుతున్నారు. ఇలా తిరుమల కొండ భక్తులతో రద్దీగా ఉంది. అయినా సౌకర్యవంతంగా, సులభంగా శ్రీవారిని దర్శంచుకుంటున్నారు. ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూలైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్‌లో వెయిట్ చేస్తున్న వారికి 3 గంటలు సమయం పడుతుంది. ప్రస్తుతం కొత్తగా క్యూలైన్‌లో‌కి వెళ్లే వారికి 3 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే భక్తుల రద్దీ‌ని బట్టి సమయాలు మారుతున్నాయని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

ఇక మంగళవారం స్వామివారిని 74, 477 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,294 మంది తలనీలాలు సమర్పించారు. వెంకన్న హుండీ ఆదాయం2 కోట్ల 84 వేలు వచ్చింది. భక్తులు 9 కంపార్టుమెంట్‌లో వేచి ఉంచి స్వామివారిని దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ చేసుకని శ్రీవారిని దర్శించుకున్న వారికి 3 గంటల సమయం పట్టింది.

Next Story