‘తిరుమలలో గదుల కేటాయింపు పై భక్తుల ఆగ్రహం’.. మాజీ మంత్రి సంచలన పోస్ట్

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-21 09:06:24  IST  )

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

‘తిరుమలలో గదుల కేటాయింపు పై భక్తుల ఆగ్రహం’.. మాజీ మంత్రి సంచలన పోస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్:తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో టీటీడీ(TTD) తిరుమల భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వాణి టికెట్ల పై గదులను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే.. చిలకలూరిపేట భక్తులు తిరుమలలో శ్రీవాణి టికెట్లపై కేటాయించిన గదులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని మాజీ మంత్రి రోజా(Former Minister Roja) సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి వేచి ఉన్నా కనీస సౌకర్యాలు లేవన్నారు. రూ.10 వేలు విరాళం ఇస్తే, బొద్దింకలు ఉన్న రూ.50 గదులు కేటాయించారని వాపోయారు. 'ఇష్టమైతే తీసుకోండి, లేదంటే వెళ్లిపోండి' అంటూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని గోవిందు శంకర్ శ్రీనివాసన్, మురళి కృష్ణాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Next Story