తిరుమలలో భక్తుల ఆందోళన.. అది తన తప్పేనన్న భక్తుడు!

by Jakkula.Mamatha |

తిరుమలలో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి భక్తుల క్యూ లైన్‌లో ఆందోళన చెలరేగిన విషయం తెలిసిందే.

తిరుమలలో భక్తుల ఆందోళన.. అది తన తప్పేనన్న భక్తుడు!
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి భక్తుల క్యూ లైన్‌లో ఆందోళన చెలరేగిన విషయం తెలిసిందే. భక్తుల(Devotees) రద్దీ పెరగడంతో.. తిరుమల(Tirumala) క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని భక్తులు ఆగ్రహనికి గురయ్యారు. దీంతో క్యూ లైన్లలో నిల్చున్న భక్తులకు కనీస సౌకర్యాలు లేవని భక్తులు నిన్న రాత్రి ఆందోళన చేశారు. అంతటితో ఆగకుండా ‘టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు డౌన్ డౌన్, ఈవో శ్యామలరావు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ గొడవకు కారణం నేనే అంటూ ఓ భక్తుడు స్పందించాడు.

తాజాగా ఆయన(భక్తుడు) మీడియాతో మాట్లాడుతూ.. తనకు జ్వరంగా ఉందని.. క్యూలైన్‌లో అందించే సాంబార్ రైస్ తినలేకపోయానని చెప్పారు. ఈ క్రమంలో పాలు ఇవ్వాలని అడిగానని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రస్టేషన్‌లో దురుసుగా మాట్లాడనని ఆయన క్లారిటీ ఇచ్చాడు. టీటీడీ సిబ్బంది తమకు అడిగిన వెంటనే పాలు కూడా ఇచ్చారని అన్నారు. క్యూలైన్ లో భక్తులకు ఏర్పాట్లు బాగానే ఉన్నాయని, ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో తాను చేసిన వ్యాఖ్యలకు చాలా బాధపడుతున్నాను అని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో గారికి క్షమాపణ చెబుతున్నానని ఆయన తెలిపారు.

Next Story