- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారికి భారీ విరాళాలు.. ఏడు బంగారు పతకాలు సమర్పించిన భక్తురాలు
తిరుమల శ్రీవారికి భక్తురాళ్లు భారీ కానుకలు సమర్పించారు. బెంగళూరు చెందిన భక్తురాలు ఏడు బంగారు పతకాలను సమర్పించారు.

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. శుక్రవారం బెంగళూరుకు చెందిన ఓ భక్తురాలు స్వామివారికి ఏడు బంగారు పతకాలను విరాళంగా అందించారు. మహదేవమ్మ అనే భక్తురాలు రూ.94.80 లక్షల విలువైన 753 గ్రాముల బరువు ఉన్న ఏడు బంగారు పతకాలను విరాళంగా అందజేసినట్లు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఈఓతో పాటు.. అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి ఆమె ఆ బంగారు పతకాలను అందజేశారు. రంగనాయకుల మండపంలో ఆమె వాటిని అందజేయగా.. అర్చకులు ఆశీర్వచనం చేసి, స్వామివారి ప్రసాదం అందజేశారు.
అలాగే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన గీతిక సాయి అనే భక్తురాలు రూ.20 లక్షల విరాళం అందజేశారు. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116, హైదరాబాద్ కు చెందిన ఏపీఎస్ టెక్నాలజీస్ సంస్థ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందజేశారు. దాతల తరపున టీటీడీ బోర్డు సభ్యులైన నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో ఈఓ ముద్దాడ రవిచంద్రకు డీడీలను అందజేశారు.






