- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులు..ఇదిగో సాక్ష్యం...!
by Vemula.Srinu Prasad |
అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి...

X
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే రాజధానిని మూడేళ్లలో నిర్మించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఫలితంగా అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణాలు త్వరగా కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు. ముందుగా సీట్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ పైపులైన్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం బళ్లారి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పైపులను అమరావతికి తరలిస్తున్నారు. ఎటు చూసినా వందలాది లారీలతో ఆయా ప్రాంతాల్లో పైపులను అన్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, ఇదిగో సాక్ష్యమంటూ చెబుతున్నారు.
Next Story






