- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్.. క్లాస్ తీసుకున్న మంత్రి సవిత
రోడ్డు ప్రమాదాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరు వాహనాదారుల్లో మార్పురావడంలేదు...

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరు వాహనాదారుల్లో మార్పురావడంలేదు. అదే తప్పు కొనసాగిస్తున్నారు. ఇందులో పెద్దలు, యువకులు అనే తేడా లేదు. సేఫ్టీ లేకుండా రోడ్లపై వాహనాలతో రయ్‌మంటూ దూసుకుపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సమయంలో ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్నారు. ఇప్పటికైనా వాహనదారులు సెఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని ఏపీ మంత్రి సవిత(Minister Savitha) అంటున్నారు.
హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న యువకుడు
అనంతపురం జిల్లా(Ananthapuram District) పెనుకొండ(Penukonda)లో రోడ్డుపై కారులో ఆమె ప్రయాణిస్తుండగా హెల్మెట్ పెట్టుకోకుండా యువకుడు బైక్ నడుపుతున్నారు. దీన్ని గమనించిన మంత్రి సవిత.. యువకుడిని తన సిబ్బందితో ఆపించారు. ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని యువకుడిని మంత్రి సవిత ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా యువకుడి తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. అది కూడా యువకుడితోనే ఫోన్ చేయించారు. బైక్‌పై తమ కుమారుడు బయటకు వెళ్తున్న ప్రతి సారీ హెల్మెట్ ధరించేలా చూసుకోవాలని తల్లికి సవిత సూచించారు. అలాగే యువకుడికి కొత్త హెల్మెట్‌ను స్థానిక కలెక్టర్, ఎస్పీ అందజేశారు. మరోసారి హెల్మెట్ లేకుండా బయటకు రావోద్దని యువకుడికి మంత్రి సవిత సూచించారు. రోడ్డు ప్రమాదాలపై మంత్రి కవిత అవగాహన కల్పించిన తీరు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.






