పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

by Kema Shiva Kumar |

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన విజయనగరం (Vizianagaram) రైల్వే స్టేషన్ సిగ్నల్ వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
X

దిశ, వెబ్‌డెస్క్: గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన విజయనగరం (Vizianagaram) రైల్వే స్టేషన్ సిగ్నల్ వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ట్రైన్‌లోని మొత్తం మూడు బోగీలు ఓ వైపునకు పడిపోయాయి. ఎమర్జెన్సీ బ్రేకులు వేసినందునే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, టెక్నికల్ టీమ్ స్పాట్‌కు చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి ట్రాక్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ మధ్యహ్నానానికి పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది.

Next Story