మీతో సహా ఎమ్మెల్యందరూ అసెంబ్లీకి రండి: జగన్‌కు డిప్యూటీ స్పీకర్ పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-18 15:36:18  IST  )

వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు...

మీతో సహా ఎమ్మెల్యందరూ అసెంబ్లీకి రండి: జగన్‌కు డిప్యూటీ స్పీకర్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) సహా వైసీపీ(Ycp) ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Deputy Speaker Raghuramakrishnam Raju) పిలుపునిచ్చారు. విశాఖలో ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వారి అంశం ఎథిక్స్ కమిటీ వద్ద ఉందని తెలిపారు. అసెంబ్లీకి ఎవరైతే వరుసగా 60 రోజులు రాకుండా ఉంటారో వారిపై అనర్హత వేటు వేయొచ్చని చెప్పారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు పరిస్థితులు ఉండవని, ఒకే తరహాలో ఉంటాయని రఘురామ తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందున పార్టీకి రాజీనామా చేయాల్సి అవసరం లేదన్నారు. తాను స్వీయ నియంత్రణ పాటిస్తున్నానని, అందువల్లే టీడీపీ సమావేశాలకు హాజరుకావడంలేదని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

Next Story