- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం కార్యాలయంలో.. వార్ రూమ్!
‘ప్రతీ ఇంటికి రక్షిత మంచినీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశ్యంతో, నిధులు ఉన్నా లేకపోయినా పనులు ఆగకుండా ఉండాలని, నీటి సంక్షోభం లేకుండా చూసేందుకు డిప్యూటీ సీఎం కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం

ఏపీలో నీటి సంక్షోభం లేకుండా చూసేందుకే..
ఎన్నికలప్పుడు వార్రూమ్ పెట్టడం కాదు..
పనులు చేసేటపుడు పెట్టడంలో తప్పు లేదు..
కార్మికులు కాదు.. శ్రామికులు ఇకనుంచి అలాగే పిలవండి..
ఏపీ అభివృద్ధిలో ఉపాధి శ్రామికుల పాత్ర కీలకం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మంగళగిరిలో ఘనంగా మేడే వేడుకలు
దిశ, డైనమిక్ బ్యూరో: ‘ప్రతీ ఇంటికి రక్షిత మంచినీటి సౌకర్యం అందించాలనే ఉద్దేశ్యంతో, నిధులు ఉన్నా లేకపోయినా పనులు ఆగకుండా ఉండాలని, నీటి సంక్షోభం లేకుండా చూసేందుకు డిప్యూటీ సీఎం (Deputy CM) కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల.కోసం వార్ రూమ్ (War Room) పెడుతున్నప్పుడు, పనులు చేసేందుకు వార్ రూమ్ పెట్టడంలో తప్పు లేదు కదా..? అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ప్రకటించారు. మంగళగిరిలో సీకే కన్వెన్షన్ లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని ఉపాధి హామీ కార్మికులతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవి నీటి కొరతను ముందుగానే గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. స్కూల్, కాలేజీల సహకారం తీసుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి, నీటిని వృధా చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే మాట చాలా కాలంగా లేవనెత్తున్నారు, దానిపై నాకు అవగాహన ఉంది నేను కూడా మాట్లాడాను, ఇది కేంద్రం నిర్ణయం తీసుకోవాలి, దాని కోసం ప్రతిపాదనలు పంపిస్తాం అని తెలిపారు. శ్రామికుల కష్టాన్ని, వారి నైపుణ్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిని తాను అని, అందుకే ఇకపై వారిని శ్రామికులు అనే పిలవాలని, కార్మికులు అని పిలవకూడదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మద్యపాన నిషేధం చెప్పి దానిపైనే ఆదాయాన్ని సంపాదించిందని తెలిపారు.
రూ.3,200 కోట్ల లెక్కలు ఇంకా తేలలేదు అన్నారు. పంచాయతీరాజ్ (Panchayathiraj) శాఖ నిర్వీర్యం చేసిందని తెలిపారు. అలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పల్లెటూర్లపై ఎంతో మమకారం ఉందన్నారు. ప్రజల కష్టాలు వారి అవసరాలను తెలుసుకున్న వ్యక్తిని తాను అని తెలిపారు. ఈరోజు మూగజీవాలకు నీటి తొట్టెలు, గోకులాలు నిర్మించడానికి కారణం అదే అన్నారు. పనిచేసేవారిని ఇకనుంచి కూలీలు అని పిలవకూడదు శ్రామికులు అని పిలవాలని సూచించారు. ఈ ఐదేళ్ల కాలంలో బాగా పనిచేయడానికి పంచాయతీరాజ్ శాఖ ను ఎంచుకున్నట్లు తెలిపారు. ఇందులో ప్రజల అవసరాలను అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ,. (Modi) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu)అన్నారు. నీతో పాటు అధికార యంత్రాంగం సచివాలయ సిబ్బంది ఉపాధి కార్మికుల కష్టం ఇందులో ఉందన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఉపాధి శ్రామికుల పనివేళల్లో మార్పు చేయాలి, వారికి నీడ కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఉపాధి హామీ శ్రామికులకు 30 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించడం జరిగిందన్నారు.
Also Read: హోంమంత్రి అనిత పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.. ఆమె రియాక్షన్ ఇదే!






