లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ TDP నేతల డిమాండ్.. జనసేన శ్రేణులకు కీలక పిలుపు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) టీడీపీ(TDP) నేతలు లేవనెత్తిన డిమాండ్ హాట్ టాపిక్‌గా మారింది.

లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ TDP నేతల డిమాండ్.. జనసేన శ్రేణులకు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) టీడీపీ(TDP) నేతలు లేవనెత్తిన డిమాండ్ హాట్ టాపిక్‌గా మారింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే అనూహ్యంగా మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి(Deputy CM Post) ఇవ్వాలంటూ ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ చేసేది సాధారణ కార్యకర్తలు కాదు.. ఏకంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. దీంతో కూటమిలో విభేదాలు మొదలయ్యాయా? అనే అనుమానం ఏపీ ప్రజల్లో, రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం చంద్రబాబు(CM Chandrababu).. ఆ పార్టీ శ్రేణులకు చురకలు అంటించారు. నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి రుద్దొద్దని హెచ్చరించారు. ఏ నిర్ణయమైనా కూటమి పెద్దలు చర్చించుకున్న తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో టీడీపీకి కౌంటర్‌కు జనసేన నేతలు మరో డిమాండ్‌ లేవనెత్తారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే.. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలనే ఆశ నిన్న, మొన్న వచ్చిందని.. కానీ పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తాము పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని కౌంటర్ ఇస్తున్నారు. ఈ డిమాండ్‌పై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దని ఆ పార్టీ నేతలు, శ్రేణులకు సూచనలు చేసింది. ఈ అంశంపై మీడియా ముందు కూడా ఎవరు మాట్లాడవద్దని చెప్పింది.

Next Story