డిప్యూటీ CM పవన్ కల్యాణ్ రాత్రి బస అక్కడే!

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన(Janasena Party) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ అంతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ(Jana Sena Formation Day) వేడుకల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డిప్యూటీ CM పవన్ కల్యాణ్ రాత్రి బస అక్కడే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన(Janasena Party) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ అంతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ(Jana Sena Formation Day) వేడుకల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చాక మొదటి ఆవిర్భావ సభ కావడంతో నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపారు. తాజాగా రేపటి పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. శుక్రవారం మధ్యాహ్నం 3:30కి హెలికాఫ్టర్ ద్వారా మంగళగిరి నుంచి చిత్రాడ బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. సభ ముగిసిన అనంతరం రాత్రి JNTU కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. శనివారం ఉదయం 9 గంటలకు మంగళగిరికి తిరుగు ప్రయాణం అవుతారని పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరోవైపు.. రేపు సభ ఉండటంతో ఏర్పాట్లు అత్యంత అట్టహాసంగా చేశారు.

11 ఏళ్లు ఎన్నో పోరాటాలు చేశామని.. తొలిసారి ఉత్సవం జరుపుకోబోతున్నామని.. ఈ సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జనసైనికులు తెలిపారు. సభకు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) సూచన మేరకు జయకేతన సభగా నామకరణం చేసినట్లు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. కాకినాడలోని ఆవిర్భావసభ కంట్రోల్‌ రూంలో బుధవారం జయకేతనం సభ గోడపత్రికను సైతం ఆయన ఆవిష్కరించారు. కాకినాడ, పిఠాపురం ప్రాంతాలకు ఎంతో సేవ చేసిన పిఠాపురం మహారాజా శ్రీరాజసూర్యారావు బహుదూర్‌ పేరును మొదటి ద్వారానికి, డొక్కా సీతమ్మ పేరును రెండో ద్వారానికి పెడుతున్నామన్నారు. విద్యాదానం చేసిన మల్లాడి సత్యలింగ నాయకర్‌ పేరుతో మూడోద్వారం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Next Story