‘మరింత బాధ్యతగా పనిచేస్తాం’.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ప్రకటన

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పలు శాఖలకు మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది.

‘మరింత బాధ్యతగా పనిచేస్తాం’.. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పలు శాఖలకు మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. అయితే.. ఈ ఏడాది కాలంలో ఏవేం పనులు చేశారో తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రజలకు మరోసారి ధన్యవాదాలు. NDA కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదిక విడుదల చేస్తున్నాము. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధికి కృషి చేస్తాం’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ట్వీట్

Next Story