డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటన అల్లూరి జిల్లాలో కొనసాగుతోంది.

డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటన అల్లూరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన కురిడి గ్రామంలో రచ్చబండ(Rachabanda) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కురిడి గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.5 లక్షల సొంత నిధులు ప్రకటించారు. దత్తత గ్రామం కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. అరకును కేరళ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కీలక ప్రకటన చేశారు. వాలంటీర్ల సమస్యను మరోసారి కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి.. సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని మాటిచ్చారు. ప్రతీ ఒక్కరు ఇంట్లో తులసి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గంజాయిని విడనాడాలని అన్నారు. సోమవారం అరకులోయలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు.

ఇందులో భాగంగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడా మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు. మూడు నెలలు క్రితం చెప్పానని.. ఈరోజు కల సాకారమైందని అన్నారు. డోలీ మోత తప్పాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇక్కడ పర్యాటకం అభివృద్ధి అవ్వాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో మొత్తం 90 కిలోమీటర్లు రోడ్లు వేస్తే.. కూటమి 8 నెలల్లో 1069 కిలోమీటర్లు రోడ్లు వేశామని.. ఇది కూటమి ప్రభుత్వానికి వైసీపీకి మధ్య ఉన్న తేడా అని చెప్పుకొచ్చారు. గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని వెల్లడించారు. దేశం మొత్తం పర్యాటకులను ఆకర్షించే అరకు పర్యాటక అభివృద్ధి కోసం సీఏం చంద్రబాబు (CM Chandrababu Naidu), మంత్రి దుర్గేష్‌లతో (Minister Durgesh) మాట్లాడతానని అన్నారు. 15 ఏళ్ళ పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలన్నారు.

Next Story