నాగాంజలి ఆత్మహత్యపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ స్పందన

by Gantepaka Srikanth |

ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య(Pharmacist Naganjali Suicide)పై డిప్యూటీ CM పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు.

నాగాంజలి ఆత్మహత్యపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య(Pharmacist Naganjali Suicide)పై డిప్యూటీ CM పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. కిమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్‌గా ఉన్న నాగాంజలి(Naganjali) తన సూసైడ్ నోట్‌లో కారకుడిగా పేర్కొన్న ఆసుపత్రి ఏజీఎం డా.దువ్వాడ దీపక్‌(Duvvada Deepak)ను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియచేశారు. కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి’ అని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థినులు, యువతుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీసు శాఖ కూడా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టడంతోపాటు బాధిత వర్గం ఆవేదనను, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తోటి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థులు ఆందోళనకు లోనవుతారు. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యాచార, హత్య ఘటన సమయంలో మెడికోలు ఆందోళనలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. విద్యార్థులకు, యువతులకు భరోసా, ధైర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలి. రాజమండ్రి ఘటన నేపథ్యంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి హోమ్ శాఖ మంత్రి అనిత(Home Minister Anitha)కు, రాష్ట్ర డీజీపీ(AP DGP)కి తెలియజేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story