గడువులోపే అమలు చేయాలి.. పవన్ కల్యాణ్ ఆదేశం

by Gantepaka Srikanth |

అటవీశాఖ(Forest Department) అధికారులతో శనివారం ఉదయం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమీక్షా సమావేశం నిర్వహించారు.

గడువులోపే అమలు చేయాలి.. పవన్ కల్యాణ్ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అటవీశాఖ(Forest Department) అధికారులతో శనివారం ఉదయం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి, తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి తీసుకెళ్ళేందుకు చేపడుతున్న చర్యలు, వన్యప్రాణులు మానవులు మధ్య ఘర్షణ వాతావరణం అరికట్టేందుకు తీసుకోవలసిన మరిన్ని చర్యల గురించి, అడవి సంరక్షణలో స్థానిక ప్రజల పాత్రను పెంచడం, ఎకో టూరిజం ని అభివృద్ధి చేయడం, మొక్కల పెంపకం, కలప ఉత్పత్తిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే అటవీ శాఖలో తీసుకోవాల్సిన చర్యలపై, గతంలో నిర్ణయించిన ప్రణాళికలను నిర్ణీమ గడువులోపు అమలు పరిచేలా, స్థానిక ప్రజలకు, పర్యావరణానికి అనుకూలంగా ఉండేలాగా స్థిరమైన అభివృద్ధి సాధించేలా పూర్తిస్థాయిలో సమగ్ర ప్రణాళికను తయారు చేయవలసిందిగా వారిని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, ఉప ముఖ్యమంత్రి OSD వెంకటకృష్ణ, అసిస్టెంట్ కన్సర్వటివ్ ఫారెస్ట్రీ N.V శివరామ్ ప్రసాద్ పాల్గొన్నారు.

Next Story