- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్ దృష్టికి పెద్ద ప్రాబ్లమ్.. 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ
కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan ) పర్యటించారు. ఉప్పాడ మత్య్సకార కుటుంబాల(Uppada Fishing Families)కు కలెక్టరేట్‌లో ఆయన చెక్కులు అందజేశారు. చేపల వేటకు వెళ్లి 18 మంది మత్స్యకారులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలకు బీమా చెక్కులు అందించారు. 18 కుటుంబాలకి రూ. 5 లక్షల చొప్పున బీమా సాయం అందజేశారు.
ఇక ఈ సమావేశంలో మత్స్యకారులు పలు సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే వారు చెప్పిన ప్రతి సమస్యను, అభిప్రాయాలను నోట్ చేసుకున్నారు.. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. పరిష్కార మార్గాలు సూచించే ప్రక్రియలో పరిశ్రమలు, మత్స్యశాఖ, పీసీబీ, పరిశ్రమల ప్రతినిధులు, మత్స్యకారులు, ఎన్జీవోలు.. స్టేక్ హోల్డర్స్ అందరినీ భాగం చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.






