వేట్లపాలెం పేలుళ్లలో 21 మంది మృతి.. పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా పరిశ్రమలో జరిగిన భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు...

వేట్లపాలెం పేలుళ్లలో 21 మంది మృతి.. పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా వేట్లపాలెం(Vetlapalem)లోని బాణాసంచా పరిశ్రమ(Fireworks industry)లో జరిగిన భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై తెలియగానే జిల్లా కలెక్టర్‌తో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలంలో ఉండి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాణాసంచా పరిశ్రమలపై అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి భద్రత చర్యలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పరిసర గ్రామాలకు పొగ అలుముకున్న క్రమంలో ఆయా గ్రామాల ప్రజలకి ధైర్యం చెప్పి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌లను ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షణ చేపట్టి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Next Story