భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు ఆయనే: డిప్యూటీ సీఎం పవన్

by Vemula.Srinu Prasad |

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు పొట్టి శ్రీరాములు అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ...

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు ఆయనే: డిప్యూటీ సీఎం పవన్
X

దిశ, వెబ్ డెస్క్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు పొట్టి శ్రీరాములు(Potti Sriramulu) అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. అమరావతి(Amaravati)లో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలుగు జాతి ఉనికి కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశారని గుర్తు చేశారు. 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా అమరజీవి జలధార పేరుతో జల్‌ జీవన్ మిషన్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. నీరు తాగే ప్రతిఒక్కరూ ఆయన్ను స్మరించుకోవాలని సూచించారు. సుమారు రూ.10 వేల కోట్లతో 7 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరజీవి జలధార పేరుతోనే ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు అడుగులు వేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

Next Story